Sarat Kumar: నటులు శరత్ కుమార్, రాధారవి అరెస్ట్ కు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

  • సినీనటుల సంఘం స్థలం వివాదం
  • అక్రమంగా విక్రయించినట్టు ఆరోపణలు
  • వ్యతిరేకంగా సాక్ష్యాలు లభ్యం
తమిళ నటులు శరత్ కుమార్, రాధారవిలను అరెస్ట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినీ నటుల సంఘానికి అధ్యక్షుడిగా శరత్ కుమార్, కార్యదర్శిగా రాధారవిలు పని చేసిన సమయంలో వచ్చిన ఆరోపణలపై ప్రాధమిక సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు అందించడంతో న్యాయమూర్తి, వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

కాంచీపురం జిల్లా వెంకటామంగళంలో ఉన్న సినీ నటుల సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దాని విచారణను పోలీసులకు బదిలీ చేసిన కోర్టు, 3 నెలల్లో స్థల విక్రయం కేసును తేల్చాలని ఆదేశించింది. కేసు విచారణ క్రమంలో శరత్ కుమార్, రాధారవిలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించడంతో వారిని అరెస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అటు శరత్ కుమార్, ఇటు రాధారవి ఇంకా స్పందించలేదు.
Sarat Kumar
Madras Highcourt
Radharavi
Arrest

More Telugu News