Jammu And Kashmir: ఉగ్రవాదుల చర్యలు ఉపేక్షించేది లేదు...గుల్‌ మహ్మద్‌ మీర్‌కుటుంబానికి అండ : ప్రధాని

  • జమ్ముకశ్మీర్‌లో పార్టీ పటిష్టానికి మహ్మద్ మిర్‌ కృషి మరువలేనిది
  • ఆయన సేవలు చిర స్థాయిగా నిలుస్తాయి
  • ఇంటి వద్దే గుల్‌ మహ్మద్‌ను నిన్న కాల్చిచంపిన ఉగ్రవాదులు
దేశంలో ఉగ్రవాదానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వమని, తమ అమానుష చర్యలతో దేశంలో భయాందోళన సృష్టించాలని ప్రయత్నించే ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం అనంత్‌నాగ్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్‌ మహ్మద్ మిర్‌ను శనివారం ఆయన ఇంటివద్దే ముష్కరులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌లో బీజేపీ బలోపేతానికి గుల్‌ అహ్మద్‌ కృషి మరువలేనిదని, ఆయన సేవలు చిరకాలం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో గుల్‌ అహ్మద్‌ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Jammu And Kashmir
ghul ahmed mir
Narendra Modi

More Telugu News