Andhra Pradesh: చంద్రబాబుకు ఆవేశం, అసహనం రావడంలో ఆశ్చర్యం ఏముంది?: ఐవైఆర్ కృష్ణారావు

  • ఏపీ ముఖ్యమంత్రిపై బీజేపీ నేత విమర్శలు
  • చంద్రబాబు చేతిలో అధికారం తీసేసుకున్నారని వ్యాఖ్య
  • సీఎస్ పద్ధతిగా పనిచేస్తున్నారని ప్రశంస
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పరోక్ష విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అకస్మాత్తుగా చేతుల నుంచి తీసేసుకోవడంతో చంద్రబాబుకు అసహనం, అవేశం వస్తోందని విమర్శించారు.

ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ..‘రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్లులు రూ.1000 కోట్లు ఉండి ఖజానాలో రూ.100 కోట్లు ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ చెల్లింపుల అధికారం మన చేతిలో నుంచి తీసేసి ఇంకొకరి చేతిలో పెడితే ఆవేశం అసహనం రావటంలో ఆశ్చర్యం లేదు. పైపెచ్చు ఆ రెండవ వ్యక్తి(సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం) ఒక పద్ధతి ప్రకారం చెల్లింపులు చేస్తున్నప్పుడు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
iyr krishna rao
Twitter

More Telugu News