Roja: పోలింగ్ తరువాతి రోజు నుంచి... నగరిలో కనిపించని రోజా!

  • పోలింగ్ మరుసటి రోజు చెన్నైకి
  • అక్కడి నుంచి విదేశాలకు ఫ్యామిలీతో
  • ఎన్నికల తరువాత సేదదీరుతున్న రోజా
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత, చాలా మంది విహార యాత్రలకు వెళ్లిపోయారు. అంతకుముందు దాదాపు రెండు నెలల పాటు అలుపెరగకుండా తిరిగి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారం చేసుకుని, ఆపై పోలింగ్ ముగియగానే తమ బంధుమిత్రులతో కలిసి పర్యాటక క్షేత్రాలకు, విదేశాలకు వెళ్లిపోయారు.

నగరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత ఆర్కే రోజా సైతం అదే దారిలో నడిచారు. పోలింగ్ రోజున సాయంత్రం 4 గంటల తరువాత ఇంటికి చేరుకున్న ఆమె, ఆ మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో కనిపించలేదు. పోలింగ్ మరుసటి రోజు తన కుటుంబంతో కలిసి ఆమె, ఇంటి నుంచి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి వెళ్లిన ఆమె, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. కనీసం పోలింగ్ సరళిపై కూడా ఆమె కార్యకర్తలు, అనుచరులతో చర్చించలేదని సమాచారం.
Roja
Foreign
Tour
Andhra Pradesh
Elections

More Telugu News