YSRCP: అప్పుడు వైఎస్ కు ఆత్మ... ఇప్పుడు జగన్ కు ప్రేతాత్మలా తయారయ్యారు!: కేవీపీపై లంక దినకర్ ఫైర్

  • బీజేపీకి తలలో నాలుకలా తయారయ్యారు
  • పోలవరంపై మాట్లాడే హక్కు కేవీపీకి లేదు
  • కమీషన్ల కోసం మట్టిపనులు చేసి దోచుకున్నారు
మీరేం మంచి పనులు చేస్తుంటే అధికారులు అడ్డంపడ్డారు? అంటూ సీఎం చంద్రబాబునాయుడిపై కేవీపీ రామచంద్రరావు ధ్వజమెత్తడం పట్ల లంక దినకర్ ఘాటుగా స్పందించారు. ఒకప్పుడు వైఎస్ కు ఆత్మగా వ్యవహరించిన కేవీపీ ఇప్పుడు జగన్ కు ప్రేతాత్మలా, కేసీఆర్ కు అంతరాత్మలా తయారయ్యారని వ్యాఖ్యానించారు. మరోవైపు కేవీపీ బీజేపీకి తలలో నాలుకలా కూడా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలు తనను మర్చిపోకుండా ఉండేందుకే కేవీపీ అప్పుడప్పుడు బయటికొచ్చి మాట్లాడుతుంటారని విమర్శించారు.

కేవీపీ పోలవరంపై ప్రశ్నించడాన్ని కూడా లంక ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజక్ట్ కు నిధులు రాకపోవడానికి కేవీపీ రాసిన లేఖలు కూడా కారణమై ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. కేవీపీ శకుని లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. ఒకప్పుడు కమీషన్ కోసం మట్టి పనులు చేసి దోచుకున్నది కేవీపీ కాదా? అలాంటి వ్యక్తికి పోలవరం గురించి మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు.
YSRCP
Jagan
KCR

More Telugu News