9 రకాల విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్న తమిళ హీరో
- కామెడీ ఎంటర్టైనర్ గా 'కోమలి'
- జయం రవి జోడీగా కాజల్
- ముఖ్యమైన పాత్రలో యోగిబాబు
ఈ సినిమాలో జయం రవి 9 గెటప్పులలో కనిపిస్తాడట. ఆయన ధరించే ఈ 9 గెటప్పులు, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఒక్కో గెటప్పు ఒక్కో మలుపుకు కారణమవుతూ, కథ ఆసక్తికరంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమాలో, జయం రవి జోడీగా కాజల్ కనిపించనుంది. ఇక మరో కథానాయికగా సంయుక్తా హెగ్డే కనిపించనుండగా, కమెడియన్ గా యోగిబాబు సందడి చేయనున్నట్టు సమాచారం.