Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం.. విద్యార్థిని దివ్య ఆత్మహత్యాయత్నం!

  • హాస్టల్ లో కెమికల్ తాగిన యువతి
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్ లో చేరిక
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న దివ్య ఈరోజు హాస్టల్ లోని తన గదిలో ఓ రసాయనాన్ని తాగింది. ఇది గమనించిన స్నేహితులు హాస్టల్ వర్గాలకు సమాచారం అందించగా, ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని గుర్తించారు.

అనంతరం విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో కళాశాల వర్గాలు దివ్యను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాయి. దివ్య స్వగ్రామం కడప జిల్లాలోని తిప్పరాజు పాలేం అని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Krishna District
suicide
student
drunk chemical
Police
nuziveedu triple it

More Telugu News