Andhra Pradesh: 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. చంద్రబాబు సునామీలో విపక్షాలు కొట్టుకుపోతాయి!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ఈ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం ఖాయం
  • మా గెలుపు గోదావరి ఉద్ధృతిలా ఉండబోతోంది
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు. చంద్రబాబు సునామీలో విపక్షాలు కొట్టుకుపోక తప్పదని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి తాను మరోసారి గెలుస్తానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తానని ధీమాగా చెప్పారు. టీడీపీ గెలుపు గోదావరి ఉద్ధృతిలా ఉండబోతోందని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు
Andhra Pradesh
Telugudesam
Gorantla Butchaiah Chowdary

More Telugu News