Telangana: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.2 లక్షలు స్వాధీనం

  • జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
  • పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు
  • ముఠా నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
తెలంగాణలోని మహబూబాబాద్ పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పెద్దమొత్తంలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ముఠాలోని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.2.9 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టణంలో ఇంకెన్ని ముఠాలు చురుగ్గా ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Telangana
mahaboobabad
ipl cricket
betting

More Telugu News