Mobile phone: పేలిన సెల్‌ఫోన్.. తీవ్రంగా గాయపడిన చిన్నారులు.. పరిస్థితి విషమం

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • సెల్‌ఫోన్‌లో ఆడుకుంటుండగా పేలిన ఫోన్
  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
సెల్‌ఫోన్ పేలిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బీసీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే షేక్ ఇస్మాయిల్‌కు సయ్యద్‌(10), మౌలాలి(6) అనే ఇద్దరు కుమారులున్నారు. శుక్రవారం చిన్నారులిద్దరూ ఇంటి వద్ద సెల్‌ఫోన్‌లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన వీరిని అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Mobile phone
Chittoor District
madanaplle
Andhra Pradesh

More Telugu News