మరో హీరో కోసం మాస్ కథను సిద్ధం చేస్తోన్న బోయపాటి?
- కేఎస్ రవికుమార్ తో బాలయ్య సినిమా
- బోయపాటి హర్ట్ అయ్యాడంటూ టాక్
- మరో హీరో కోసం కథ రెడీ చేస్తోన్న బోయపాటి
చరణ్ తో బోయపాటి చేసిన 'వినయ విధేయ రామ' పరాజయంపాలు కావడమే బాలకృష్ణ మనసు మార్చుకోవడానికి కారణమనే టాక్ వచ్చింది. ఏదేమైనా బాలకృష్ణ నిర్ణయం బోయపాటిని చాలా హర్ట్ చేసిందట. దాంతో ఆయన కూడా మరో హీరోతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో, మాస్ అంశాలతో కూడిన ఒక కథను సిద్ధం చేసుకుంటున్నాడట. కథపై కసరత్తు పూర్తయిన తరువాత హీరో ఎవరనేది చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు.