Andhra Pradesh: ఈరోజు మధ్యాహ్నం 52,812 మంది తుపాను బాధితులకు భోజనం అందించాం!: ఏపీ సీఎం చంద్రబాబు

  • ఫణిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
  • ఈరోజు ఉదయం 9,403 మందికి అల్పాహారం అందించాం
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తున్న ఫణి పెను తుపానును ఎదుర్కొనేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా తుపాను బాధితులకు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం అందజేస్తున్నామని వెల్లడించారు. నిన్న 19,129 మందికి మధ్యాహ్న భోజనం అందజేశామనీ, 33,200 మందికి రాత్రి భోజనం అందించామని పేర్కొన్నారు.

ఈరోజు ఉదయం 9,403 మందికి అల్పాహారం అందించామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం కూడా 52,812 మందికి భోజనం సరఫరా చేశామన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలనీ, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
cyclone
Twitter

More Telugu News