కేసీఆర్ ది విధానాల సర్కార్ కాదు నినాదాల సర్కార్: పొన్నాల లక్ష్మయ్య

షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్ ది విధానాల సర్కార్ కాదని, నినాదాల సర్కార్ అని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్న కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్, పబ్, ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, కేసీఆర్ తప్పు చేశారు కనుకనే మోదీ వద్ద మోకరిల్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
t congress
ponnala

More Telugu News