Odisha: ఒడిశాను వణికిస్తోన్న ‘ఫణి’.. కాగితంలా ఎగిరిపోయిన రూఫ్ టాప్.. వీడియో వైరల్!

  • ఫూరీ వద్ద తీరం దాటిన ‘ఫణి’ పెను తుపాను
  • ఉత్తరాంధ్రపై కూడా తీవ్ర ప్రభావం
  • జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
ఒడిశాలోని పూరీ తీరాన్ని తాకిన ఫణి ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తాజాగా రాజధాని భువనేశ్వర్ లో ఫణి విధ్వంసంపై వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇక్కడి భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ గాలుల తీవ్రతకు కాగితం ముక్కలా ఎగిరిపోయింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో భారీ చెట్లు కూడా చిగురుటాకుల్లా వణికిపోయాయి.

కాగా, ఫణిని ఎదుర్కొనేందుకు నిత్యావసరాలను సమకూర్చుకున్నామనీ, అవసరమైతే ఇతరులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భువనేశ్వర్ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఫణి పెను తుపాను బీభత్సానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రపై కూడా ఫణి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీంతో ఈసీ విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో కోడ్ ను ఎత్తివేసింది.





Odisha
phoni cyclone
Andhra Pradesh
strong winds

More Telugu News