shahid afridi: తన అసలు వయసు ఎంతో బయటపెట్టిన షాహిద్ అఫ్రిదీ!
- 1996లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అఫ్రిదీ
- అప్పుడు అతని వయసు 16 ఏళ్లంటూ ప్రచారం
- కానీ అప్పుడు తన వయసు 19 ఏళ్లన్న అఫ్రిదీ
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మిస్టరీగా మిగిలిన వాటిలో పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అసలు వయసు ఎంత? అనే విషయం ఒకటి. ఈ సందేహానికి అఫ్రిదీ ఎట్టకేలకు ముగింపు పలికాడు. 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో అఫ్రిదీ 37 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం రేపాడు. ఆ సమయంలో అధికారులు తన వయసును తప్పుగా ప్రకటించారని తెలిపాడు.
అప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ 16 ఏళ్లుగా చెప్పారని అసలు నిజాన్ని బయటపెట్టాడు. 'గేమ్ ఛేంజర్' అనే పుస్తకంలో అఫ్రిది ఈ విషయాన్ని వెల్లడించాడు. మార్చి 1న అఫ్రిది అధికారికంగా 39వ పడిలో పడ్డాడు. తన కెరీర్లో మొత్తం 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు.