Monkey: కోతికి దొంగతనం చేయడం నేర్పించిన ఘనుడు... టోల్ గేట్ నుంచి డబ్బు స్వాహా!

షార్ట్స్‌లో చూడండి
కోతికి దొంగతనం చేయడం నేర్పించిన ఓ ఘనుడు, టోల్ గేట్ బూత్ నుంచి దాని సాయంతో రూ. 5 వేలు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన కాన్పూర్ సమీపంలోని డెహత్ దగ్గర ఉన్న బారా టోల్ ప్లాజాలో జరిగింది. టోల్ గేట్ వద్దకు ఓ కారు వచ్చి ఆగగానే, కారు కిటికీలో నుంచి ఓ మర్కటం గబుక్కున బయటకు దూకి క్యాబిన్ కిటికీ గుండా లోపలికి వచ్చింది. డబ్బు ఉంచే సొరుగు నుంచి చేతికందినంత తీసుకుని అంతే వేగంగా వెనక్కు వెళ్లిపోయింది. ఈ హాఠాత్పరిణామం నుంచి తేరుకునే సరికే కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కోతిని చూడగానే భయానికి గురైన టోల్ ప్లాజా ఉద్యోగి, దాన్ని తరిమేయాలని చూసినా ఫలితం లేకపోయింది.
Go Back to Shorts
Monkey
Kanpur
Toll Gate

More Telugu News