రజనీకాంత్ చిత్ర బృందంపై విద్యార్థుల దాడి... మురుగదాస్ సీరియస్!

  • దర్బార్ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • కాలేజీలో సీన్లు తీస్తుండగా షూట్ చేసిన విద్యార్థులు
  • అడ్డుకోవడంతో వాగ్వాదం, గొడవ
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రంలో నటిస్తుండగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగా ఓ కాలేజీలో సీన్లు తీస్తుండటంతో, విద్యార్థులు వారిపై రాళ్లదాడికి దిగారు. సినిమా షూటింగ్ ను చూసేందుకు వచ్చిన విద్యార్థులు, తమ సెల్ ఫోన్లలో అక్కడి దృశ్యాలను తీస్తుండటంతో, యూనిట్ సభ్యులు వారిని అడ్డుకున్న వేళ, తొలుత వాగ్వాదం, ఆపై రాళ్లదాడి జరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన మురుగదాస్, తన సినిమా ఫొటోలు లీక్ కావడంతో తీవ్ర అసంతృప్తికి లోనై, వెంటనే లొకేషన్ మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Rajanikant
Darbar
Murugadas
Students

More Telugu News