JC Diwakar reddy: జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ వారసులు జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డిల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ జేసీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ, సీపీఐ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జేసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడం నిజమేనని నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Go Back to Shorts
JC Diwakar reddy
Anantapur District
Telugudesam
EC

More Telugu News