Jana Sena: జనసేనకు భారీ షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత మారిశెట్టి రాఘవయ్య

  • కోశాధికారిగా ఉన్న రాఘవయ్య
  • ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన నేత
  • మరో నేత అర్జున్ కూడా గుడ్‌బై
ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే జనసేనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు అధినేత పవన్‌కు గురువారం పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన రాఘవయ్య అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం సొంతపార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. రాఘవయ్య గతంలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీలోనూ పనిచేశారు. వ్యక్తిగత కారణాలతోనే.. అని ఆయన చెబుతున్నప్పటికీ వేరే కారణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, రాఘవయ్యతోపాటు మరో నేత అర్జున్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు.  
Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh
Marisetty raghavaiah

More Telugu News