Navi: తుపాను సహాయక చర్యల్లో భాగంగా విశాఖ తీరానికి చేరుకున్న యుద్ధ నౌకలు

  • అప్రమత్తమైన అధికారులు
  • రంగంలోకి దిగిన నావికాదళం
  • హెలికాఫ్టర్లను సిద్ధం చేసిన ఎయిర్‌ఫోర్స్
ఫణి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండబోయే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు సాయం చేసేందుకు నావికాదళం కూడా రంగంలోకి దిగింది. సహాయక బృందాల తరలింపు కోసం ఎయిర్‌ఫోర్స్ ఇప్పటికే హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ప్రజలకు అవసరమైన సహాయక సామగ్రిని, వైద్య సహాయాన్ని అందించేందుకు బృందాలతో ఇప్పటికే కథ్మత, సహ్యాద్రి యుద్ధ నౌకలు విశాఖపట్టణం తీరానికి చేరుకున్నాయి. ఒడిశాకు డైవింగ్ సిబ్బందితో పాటు వైద్య బృందాలు రోడ్డు మార్గంలో ఒడిశాకు బయల్దేరి వెళ్లాయి.
Navi
Airforce
Odisha
Helicaptors
kadmatha
Sahyadri

More Telugu News