Lakshmikanth Burman: సహచరులపై కాల్పులు జరిపిన జవాను.. ఒకరి మృతి

  • ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
  • డిప్యుటేషన్‌పై హౌరా వెళ్లిన లక్ష్మీకాంత్
  • ఘటనకు కారణాలు తెలియరాలేదు
హౌరాలో డిప్యుటేషన్ మీద ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వెళ్లిన జవాను తోటి జవానులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అసోం రైఫిల్స్‌కు చెందిన లక్ష్మీకాంత్ బర్మన్ అనే జవాను హౌరాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు డిప్యుటేషన్‌పై వెళ్లాడు.

నేడు పశ్చిమ బెంగాల్‌లోని బగ్నాన్‌ క్యాంపులో తోటి జవానులపై లక్ష్మీకాంత్ 18 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భోళానాథ్ దాస్ అనే తోటి ట్రూపర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. లక్ష్మీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న ఆర్మీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
Lakshmikanth Burman
Bholanath Das
Howra
West Bengal

More Telugu News