Mahesh Babu: 'మహర్షి' రీమేక్ పై దృష్టిపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో నిర్మితమైన 'మహర్షి' .. ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రీమేక్ పై తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన 'పోకిరి' .. 'ఒక్కడు' సినిమాలు, తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలను అందించాయి. దాంతో 'మహర్షి' సినిమా రీమేక్ పై విజయ్ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. 'మహర్షి' ఫలితం ఎలా ఉంటుందో చూసుకుని విజయ్ రంగంలోకి దిగొచ్చని చెప్పుకుంటున్నారు. 
Go Back to Shorts
Mahesh Babu
vijay

More Telugu News