rajasekhar: సక్సెస్ లేకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు: రాజశేఖర్

  • మంచి కథలు దొరకాలి 
  • 'కల్కి'కి ముందు ఎన్నో కథలు విన్నాను
  • మంచి ప్రాజెక్ట్ చేయాలనేదే మా ఉద్దేశం
రాజశేఖర్ ప్రస్తుతం 'కల్కి' సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఒక వేదికపై రాజశేఖర్ మాట్లాడుతూ ... "హీరోల నుంచి సినిమాలు ఆలస్యంగా వస్తుండటానికి కారణం వుంది. ప్రతి హీరో కూడా ఫ్లాప్ కి భయపడతాడు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు .. చూసీచూడనట్టుగా వెళ్లిపోతుంటారు.

అందుకే చేస్తే మంచి ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉండటం వలన మా నుంచి సినిమాలు తక్కువగా .. ఆలస్యంగా వస్తుంటాయి. 'గరుడవేగ' తరువాత 100 కథలు వింటే ఒక కథ నచ్చింది .. అదే 'కల్కి'. కథల కొరత ఉండటం కూడా సినిమాలు తక్కువగా చేయడానికి మరో కారణం. మంచి కథలు దొరికితే వెంటవెంటనే సినిమాలు చేయాలని మాకూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 
rajasekhar

More Telugu News