Telangana: తెలంగాణలో ఓలా కారు బీభత్సం.. ప్రగతిభవన్ బారికేడ్లను ఢీకొట్టిన వాహనం!

  • గాయపడ్డ ఇద్దరు మహిళా ప్రయాణికులు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • పూర్తిగా దెబ్బతిన్న కారు ముందుభాగం
తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు ఓలా కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్టలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టింది. వేగంగా వచ్చిన వాహనం రక్షణకోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గట్టిగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన పోలీసులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారును ఘటనాస్థలి నుంచి క్లియర్ చేశారు. కాగా, ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కారును పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Telangana
pragati bhawvan
ola car
rammed
barricades
Police

More Telugu News