Trisha: నా కుమార్తె క్షేమంగానే ఉంది: త్రిష తల్లి ఉమ

  • షూటింగ్ లో త్రిష స్పృహ కోల్పోయినట్టు వార్తలు
  • ఆసుపత్రిలో చేరిందంటూ వదంతులు
  • కొట్టిపారేసిన ఉమా కృష్ణన్
తన కుమార్తె త్రిష క్షేమంగానే ఉందని, ఆమె ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆమె తల్లి ఉమా కృష్ణన్ కోరారు. 'రాంగీ' అనే తమిళ చిత్రం షూటింగ్‌ చేస్తుండగా, త్రిష స్పృహ కోల్పోయిందని, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని వార్తలు రాగా, ఉమ ఖండించారు. రెండు రోజుల క్రితం షూటింగ్ లో త్రిష హఠాత్తుగా పడిపోయినట్టు మీడియాలో వార్తలు రావడంతో, అభిమానులు కలవరపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో వదంతులకు స్వస్తి పలకాలని భావించిన ఉమ, తన కుమార్తె క్షేమమని, సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు రేయింబవళ్లూ శ్రమిస్తోందని తెలిపారు.
Trisha
Uma Krishnan
Hospital
Shooting

More Telugu News