'మారుతీరావు లెజండ్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు... విరుచుకుపడిన అమృత!
- గత చరిత్ర తెలుసుకోకుండా పోస్టులా?
- వెనకేసుకు రావద్దు
- ప్రణయ్ భార్య అమృత
కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, బహుజన ప్రతిఘటన వేదిక కో ఆర్డినేటర్ సాంబశివరావులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, మారుతీరావు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత తన కుటుంబంలో ప్రాణహాని భయం ఏర్పడిందని, ఎవరినీ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తన విషయంలోనూ అసభ్యకర పోస్టులు వస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అమృతకు ఆసరాగా నిలుస్తామని చెప్పిన సంఘాల నేతలు, నిందితులకు కఠిన శిక్ష పడేవరకూ పోరాడతామని తెలిపారు.