Nagababu: విజయసాయిరెడ్డికి అంత నైతికత ఉందా?: నాగబాబు సెటైర్

  • లక్ష్మీ నారాయణ ఎక్కడ? విజయసాయి ఎక్కడ? 
  • 25 రోజులు ఆగకుండా సర్వేలంటున్నారా
  • ఈ దరిద్రం మాకొద్దన్న నాగబాబు
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై ట్వీట్ చేసే నైతికత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని జనసేన నేత, ఆ పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, "ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రతి వాళ్లూ... నాకెన్ని సీట్లు వస్తాయ్... నా సర్వేలో ఇంత వచ్చింది, నీ సర్వేలో ఇంత వచ్చింది. ఎందుకు? ఆల్ రెడీ నిక్షిప్తం అయ్యిందిగా. 25 రోజులు ఆగలేరా? ఈలోపుగా ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు.

 మనం ఒక్కళ్లమే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒక్కడే. రూములో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ మనశ్శాంతిగా ఉన్నారు. నాయుడుగారేమో సమావేశాల మీద సమావేశాలు, జగన్ గారేమో... ఆ విజయసాయిరెడ్డితోటి రకరకాల వింత ట్వీట్లు. విజయసాయిరెడ్డి నాకు ఒకప్పుడు ఫ్రెండ్. ఆయనకు జేడీ లక్ష్మీ నారాయణ మీద ట్వీట్ వేసేంత నైతికత ఉందా అసలు? ఊహించగలమా? ఆయనెక్కడ? విజయసాయిరెడ్డి ఎక్కడ? ఓ రెండు మూడు సార్లు చదివిన తరువాత... బాబూ నీతో దరిద్రం మాకొద్దు, పనులున్నాయని చెప్పి, వదిలించుకున్నా" అని అన్నారు.
Nagababu
Lakshminarayana
Vijay Sai Reddy
Twitter

More Telugu News