Tirumala: ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు

  • 13 నుంచి మూడు రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు
  • ఆ మూడు రోజుల్లో నిలిచిపోతున్న శ్రీవారి సేవలు
  • కానుకల లెక్కింపునకు అదనపు పనివేళలు
తిరుమలలో ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మూడు రోజుల్లో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను ఈ మూడు రోజుల్లోనూ నిలిపివేయనున్నట్టు పేర్కొంది.

కాగా, కానుకల లెక్కింపు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించిన టీటీడీ అధికారులు పరకామణి పని వేళలను కూడా పెంచారు. తిరుపతి పరకామణికి తరలించేందుకు బుధవారం ఉదయం వందలాది నాణేల బస్తాలను ఒకేసారి బయటకు తీసుకురావడంతో కొంత సమయం పాటు భక్తుల ఆలయ ప్రవేశాన్ని నిలిపివేశారు.
Tirumala
Tirupati
TTD
Lord venkateswara
goddess padmavathi

More Telugu News