Vijay Sai Reddy: ఆ ఒక్కటీ ఎందుకు చేయలేకపోయానా అని చంద్రబాబు విపరీతంగా బాధపడుతున్నాడట!: విజయసాయిరెడ్డి

  • వైసీపీ నేత వరుస ట్వీట్లు
  • సుజనా, మురళీమోహన్ పైనా విమర్శలు
  • మే 23 తర్వాత ఇంకెంతమంది అజ్ఞాతంలోకి వెళతారోనంటూ సెటైర్
వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు చేశారు. "చంద్రబాబునాయుడు ఈ మధ్య తన వాళ్ల వద్ద ఓ విషయంలో విపరీతంగా బాధపడిపోతున్నాడట. సీబీఐ, ఈడీ, విజిలెన్స్ కమిషన్, జ్యుడిషియరీ తదితర వ్యవస్థల్లో తనవాళ్లను ఎంతో తెలివిగా చొప్పించగలిగానని, కానీ, ఎన్నికల సంఘంలో కూడా మన మనిషంటూ ఒకడుంటే ఎంతో బాగుండేదని వాపోతున్నాడట" అంటూ ట్వీట్ చేశారు.

అంతేగాకుండా, టీడీపీ నేత సుజనా చౌదరి, మురళీమోహన్ లపైనా విజయసాయి స్పందించారు. "హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ దొరికిపోయిన మురళీమోహన్ ఇప్పుడెక్కడ ఉన్నాడు? పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న భయంతో వైజాగ్ లో దాక్కున్నట్టు చెబుతున్నారు. మరో ఎంపీ సుజనా సీబీఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే 23 తర్వాత ఇంకెంతమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళతారో చూడాలి" అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News