Maharasthra: భద్రతా బలగాలపై దాడిని ఖండిస్తున్నా: రాష్ట్రపతి

  • అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
  • గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలి
  • హింసకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఐక్యంగా ఉంది
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నేడు మావోయిస్టులు జరిపిన దాడిలో 15 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భద్రతా బలగాలపై మావోలు జరిపిన దాడిని ఖండిస్తున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి హింసకు వ్యతిరేకంగా జాతి మొత్తం ఐక్యంగా ఉందని కోవింద్ పేర్కొన్నారు.
Maharasthra
Gadchiroli
Police
Mavoists
Ramnath Kovind

More Telugu News