Phani Cyclone: ఆ నాలుగు జిల్లాలకు కోడ్ నుంచి మినహాయింపునివ్వండి: ఈసీకి చంద్రబాబు లేఖ

  • నాలుగు జిల్లాలపై అధికంగా ఫణి ప్రభావం
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూ.గో. జిల్లాలలో హై అలర్ట్
  • నేతలు స్పందించేందుకు వీలు కల్పించండి
ఫణి తుపాను ప్రభావం ఏపీలోని నాలుగు జిల్లాలపై అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ నాలుగు  జిల్లాలకు ఎన్నికల నియమావళి నుంచి మినహాయింపునివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో హై అలర్ట్ ఉన్న కారణంగా ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపునివ్వాలని చంద్రబాబు లేఖలో ఈసీని కోరారు. అప్పుడే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధ ప్రాతిపదికన స్పందించేందుకు వీలుంటుందని తెలిపారు.  
Phani Cyclone
Election commission
Chandrababu
Srikakulam
Visakhapatnam

More Telugu News