V Hanumantha Rao: కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే నేను.. నన్ను బఫూన్ అంటావా?: కేటీఆర్‌పై వీహెచ్ ఫైర్

  • మాట్లాడే భాష మార్చుకో
  • నోరు అదుపులో పెట్టుకో
  • అహంకారపు మాటలొద్దు
తాను కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టానని, అలాంటి తనను బఫూన్ అంటావా? అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ మాట్లాడే భాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని, అహంకారపు మాటలు వద్దని హితవు పలికారు. సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో తేలుతుందని వీహెచ్ పేర్కొన్నారు. తన బావమరిదికి గ్లోబరినాతో సంబంధం లేకుంటే ఎందుకు పెద్దమ్మ గుడికి రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
V Hanumantha Rao
KTR
Globerina
TRS
Congress

More Telugu News