Andhra Pradesh: జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్!

  • సుభాషణ్ రెడ్డి ఇంటికి వచ్చిన జగన్ 
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచి జస్టిస్ సుభాషణ్ రెడ్డి
ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లోకాయుక్త మాజీ చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషణ్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

దీంతో సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని బంధువులు అవంతినగర్ లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జస్టిస్ సుభాషణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
Andhra Pradesh
Telangana
justic
subhashan reddy
YSRCP
Jagan
Hyderabad

More Telugu News