Telangana: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్-10 నగరాల్లో హైదరాబాద్, విజయవాడ!

  • అధ్యయనం చేపట్టిన డబ్ల్యూఈఎఫ్
  • వివరాలను ప్రకటించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
  • రెండో స్థానంలో నిలవనున్న భాగ్యనగరం
మన హైదరాబాద్ నగరం త్వరలో మరో ఘనత అందుకోబోతోందని తెలంగాణ మున్సిపల్, పట్టణ విభాగం ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. 2035 నాటికి హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు ఈ జాబితాలో హైదరాబాద్ కన్నా కొంచెం ముందు ఉందని చెప్పారు. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) 2019-2035 మధ్యకాలానికి ప్రకటించిన అంచనాలను అరవింద్ కుమార్ ప్రస్తావించారు. ఈ జాబితాలో విజయవాడ ఏడో స్థానంలో నిలుస్తుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది.
Telangana
Andhra Pradesh
wef
fastest growing cities
Hyderabad
Vijayawada

More Telugu News