Jammu And Kashmir: ఏకంగా గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ నే హ్యాక్ చేసిన ఆకతాయిలు!
- జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్ కు షాక్
- పాకిస్థాన్ ప్రధానిని ఫాలో అవుతున్నట్లు మార్పులు
- వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాజ్ భవన్
ఇప్పటివరకూ ప్రభుత్వ, రక్షణశాఖకు చెందిన వెబ్ సైట్లే హ్యాకింగ్ కు గురవ్వడాన్ని చూశాం. తాజాగా జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పైనా హ్యాకర్లు పంజా విసిరారు. ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఫాలో అవుతున్నట్లు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ భవన్ వర్గాలు అవసరమైన చర్యలు చేపట్టాయి.
అకౌంట్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాయి. ఈ విషయమై రాజ్ భవన్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. హ్యాకింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిందిగా జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.