Social Media: ఇలా అడిగితే ఎలా చెప్పను... మంచి పధ్ధతి కాదు: రేణూ దేశాయ్ లైవ్ వీడియో

  • ఫ్యాన్స్ తో లైవ్ వీడియోలో మాట్లాడిన రేణు
  • కాబోయే భర్తను ఇప్పుడే బయటపెట్టబోనని వ్యాఖ్య
  • వేరేవాళ్ల పర్సనల్ జీవితంపై ప్రశ్నలొద్దని హితవు
తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో లైవ్ లో మాట్లాడిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, ఎవరూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను అడగవద్దని క్లాస్ పీకారు. కాబోయే భర్త పేరు చెప్పాలని ఓ అభిమాని కోరగా, అతని పేరును తాను చెప్పలేనని, పెళ్లి అయిన తరువాత అతని వివరాలు తెలుస్తాయని అన్నారు. తాను ఈ లైవ్ వీడియోలో అతన్ని బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టలేనని, అతనికి కూడా కొంత ప్రైవసీ ఉండాలని అన్నారు.

అతను సినీ, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తి కాదని, ఓ ఐటీ ప్రొఫెషనల్ అని అన్నారు. ఇక మరో ఫ్యాన్ ఇంకో అడుగు ముందుకేసి, కాబోయే భర్తను ఎప్పుడెప్పుడు కలుస్తారు? అని ప్రశ్నించగా, ఇలా అడగటం బ్యాడ్ మేనర్స్ అని హితవు పలికారు. ఇది మంచి సంస్కారం కాదని, వేరేవాళ్ల పర్సనల్ విషయాలు అడగకూడదని అన్నారు. ఇలా అడిగితే, తాను సమాధానాలు ఎలా చెప్పగలనని, ఏ సెలబ్రిటీలయినా, వారు కూడా మనుషులేనని గుర్తుంచుకోవాలని చెప్పారు.
Social Media
Renudesai
Live Video

More Telugu News