Justis Subhashan Reddy: జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత!

  • కొంతకాలంగా అనారోగ్యం
  • పరిస్థితి విషమించి కన్నుమూత
  • నేటి సాయంత్రం అంత్యక్రియలు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గడచిన నెల రోజులుగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, న్యాయవాదులుగా రాణిస్తుండగా, మరొకరు ఇంజనీర్ గా ఉన్నారు.

గతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్‌ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌ లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నేటి సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. 
Justis Subhashan Reddy
Died
Hyderabad

More Telugu News