Ayyanna Patrudu: తెలంగాణలో వారిద్దరూ మౌనంగా ఉండటమే టీడీపీ గెలుపునకు సంకేతం: అయ్యన్నపాత్రుడు

  • ఎన్నికలకు ముందు ఎన్నో మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్
  • ఇంటెలిజెన్స్ నివేదిక చూసి నోరు మెదపని నేతలు
  • గెలిచేది టీడీపీయేనన్న అయ్యన్నపాత్రుడు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ గెలుస్తాడని, తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నారని అదే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సంకేతమని తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

తరచూ తెలుగుదేశం పార్టీని, ఆంధ్రులను కించపరుస్తూ మాట్లాడిన వీరిద్దరూ ఇప్పుడు నోరెత్తడం లేదని, రాష్ట్రంలో పోలింగ్ ను చూసిన తరువాత వారి నోట మాట రావడం లేదని అన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వారు రిపోర్టును తెప్పించుకున్నారని, దాన్ని చూసిన తరువాత మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని వారికి అర్థమైందని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఓ సమీక్షలో 'జగన్ కు అంత సీన్ లేదు' అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తనకు తెలిసిందన్నారు.
Ayyanna Patrudu
KCR
KTR

More Telugu News