simbu: 37 రోజుల్లో 13 కేజీల బరువు తగ్గిన శింబు

  • శింబు తాజా చిత్రంగా 'మానడు'
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
  •  వచ్చేనెలలో సెట్స్ పైకి   
కొంతకాలంగా శింబు కెరియర్ గ్రాఫ్ బాగానే వుంది. తన అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మానడు' రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ సినిమాలో శింబు పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుందట. అందువలన ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ కారణంగా షూటింగు మొదలయ్యే సమయానికి 13 కేజీల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని వెంకట్ ప్రభు చెప్పడంతో, అప్పటి నుంచి కసరత్తు మొదలెట్టిన శింబు సక్సెస్ అయ్యాడు. 37 రోజుల్లో 13 కేజీల బరువు తగ్గిన శింబు, ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. 
simbu
kalyani priyadarshini

More Telugu News