sai pallavi: సూర్యను చాలా ఇబ్బంది పెట్టేశాను: సాయిపల్లవి

  • సూర్య చాలా మంచి మనిషి
  • 50 టేకులు తీసుకున్నా సూర్య విసుక్కోలేదు
  • సూర్యతో నటించడం అదృష్టం    
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. ఆమె నటనను ఇష్టపడే అభిమానులు ఎంతోమంది వున్నారు. ఆమె తాజా చిత్రంగా తమిళంలో 'ఎన్జీకే' నిర్మితమైంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సూర్య గురించి సాయిపల్లవి ప్రస్తావిస్తూ .. " నా అభిమాన హీరో సూర్య. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అలాంటి ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం నా అదృష్టం. సెట్లో సూర్యను నేను చాలా దగ్గర చూశాను. సెట్లోని వాళ్లందరినీ ఆయన తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకుంటారు. ఆయన కాంబినేషన్లోని ఒక సీన్ కోసం నేను 50 టేకులు తీసుకున్నా, ఆయన విసుక్కోలేదు. ఎంతో ఓపికతో వుంటూ ప్రోత్సహించారు. అలాంటి వ్యక్తిని నేను చూడలేదు" అంటూ చెప్పుకొచ్చింది.
sai pallavi
surya

More Telugu News