prithi nigam: అమితాబ్ తో కలిసి నటిస్తానని కలలో కూడా అనుకోలేదు: నటి ప్రీతీ నిగమ్

  • అమితాబ్ అంటే ఎంతో అభిమానం
  •  నా నటనను అమితాబ్ మెచ్చుకున్నారు
  •  ఆయనతో కలిసి ఫొటో దిగాను  
బుల్లితెరపై విభిన్నమైన పాత్రల ద్వారా .. విలక్షణమైన పాత్రల ద్వారా ప్రీతీ నిగమ్ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నాకు అమితాబ్ .. రేఖ అంటే విపరీతమైన అభిమానం. మా ఇంట్లో ఎక్కడ చూసినా వాళ్ల ఫోటోలే అంటించేదానిని. అమితాబ్ గారిని దూరం నుంచి చూసినా చాలని అనుకునే నేను, ఆయనతో కలిసి నటించాను.

అమితాబ్ తో ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా 'షూబైట్' సినిమా తీశారు. అందులో నేను ఆయనతో కలిసి నటించాను. ఆయన నా నటనను మెచ్చుకోవడం ఒక అందమైన జ్ఞాపకం. ఆయనతో కలిసి ఒక ఫొటో దిగుతానని అంటే, షూటింగు తరువాత అన్నారు. పేకప్ చెప్పిన తరువాత .. గుర్తుపెట్టుకుని మరీ నన్ను పిలిచి తనతో ఫొటో తీసుకోమన్నారు. ఈ రెండు విషయాలు నా జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి" అని చెప్పుకొచ్చారు. 
prithi nigam
nagesh

More Telugu News