Chandrababu: ఆయన మాటలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే: చంద్రబాబు

  • శ్రీశ్రీ 109వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఆయన మాటలు మన లక్ష్యాలు చేరుకోవటానికి ఉత్సాహ పరుస్తాయి
  • వరుస ట్వీట్లు చేసిన ముఖ్యమంత్రి
మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) 109వ జయంతి సందర్భంగా.. ఆయన రగిలించిన స్ఫూర్తిని తలచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలలో వరుస ట్వీట్లు చేశారు. 'నిన్నటిలో జీవించటం మానేసి రేపటి కార్యాల గురించి ఆలోచించమనే నేననేది, కాగల కార్యాలను ఏ గంధర్వులూ తీర్చరు. మనమే కాలాన్ని మధురాతి మధురంగా తీర్చి దిద్దుకోవాలి.

ఆర్ధిక జీవితములోని అసమానతలణగించగ ఆగణిత విశ్వాసముతో ప్రగతి బాట పయనించగ కదలి రండి.. అని పిలుపిచ్చిన మహకవి శ్రీశ్రీ మాటలు మానవాళికి ఎప్పుడూ దిక్సూచిలా పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. వారి 109వ జన్మదినాన్ని పురస్కరించుకుని వ్యక్తికి బహువచనం శక్తి అన్న ఆయన మాటలు మనందరం టీం ఆంధ్రప్రదేశ్‌గా మరింత శ్రమించి మన లక్ష్యాలు చేరుకోవటానికి ఉత్సాహ పరుస్తాయని నా నమ్మకం' అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News