మరో ఇంటర్ విద్యార్థి బలి.. గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
 హైదరాబాద్ నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన సాహిల్ అనే విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సాహిల్ తండ్రి మాజీ ఆర్మీ ఉద్యోగి. ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తన తండ్రికి చెందిన గన్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకుని సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాహిల్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఏ సమస్యకూ ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఎందరో చెబుతున్నా, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం... వారి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతోంది.
Go Back to Shorts
inter
student
suicide
hyderabad

More Telugu News