preethi nigam: ఆ సీరియల్ సమయంలోనే మా పరిచయం జరిగింది: నటి ప్రీతీ నిగమ్

  • బుల్లితెర నటిగా ప్రీతీ నిగమ్ 
  • నాగేశ్ తో అప్పుడు పరిచయమైంది
  • ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము
తెలుగు టీవీ సీరియల్స్ చూసేవారికి ప్రీతీ నిగమ్ ను కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వివిధ ధారావాహికల్లో ఆమె విభిన్నమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం కూడా ఆమె సీరియల్స్ తో బిజీగానే వున్నారు. తాజాగా ఆమె 'అలీతో సరదాగా' కార్యక్రమానికి తన భర్త నాగేశ్ తో కలిసి హాజరయ్యారు.

'రుతు రాగాలు' సీరియల్లో నేను చాలామంచి పాత్రను పోషించాను. ఆ సీరియల్ షూటింగు జరుగుతూ ఉండగా, నాగేశ్ జాయిన్ అయ్యారు. ఈ సీరియల్లో ఆయన నాకు అన్నయ్య పాత్రలో నటించారు. ఆ సమయంలోనే మా పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి' అని చెప్పుకొచ్చారు.
preethi nigam
nagesh

More Telugu News