punjab: 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

  • పంజాబ్, చండీగఢ్ లలో ప్రచారం నిర్వహించనున్న స్టార్ క్యాంపెయినర్లు
  • జాబితాలో రాహుల్, సోనియా, ప్రియాంక, మన్మోహన్
  • మే 19న పోలింగ్
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ప్రచారాన్ని నిర్వహించే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. వీరిలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీలు ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కీలక నేతలైన అహ్మద్ పటేల్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, షీలా దీక్షిత్, మనీశ్ తివారీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాజ్ బబ్బర్, జైవీర్ షెర్గిల్ తదితరులు ఉన్నారు. మే 19న (చివరి దశ) ఈ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
punjab
chandigarh
star campaingners
congress

More Telugu News