Raghuramakrishnamraju: నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఇంటిపై సీబీఐ దాడులు

  • గతంలో బ్యాంకుల నుంచి రుణాలు
  • తిరిగి చెల్లించడంలో విఫలం
  • ఈ ఉదయం నుంచి సోదాలు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడిన రఘురామకృష్ణంరాజు ఇంటిపై ఈ ఉదయం నుంచి సీబీఐ దాడులు జరుగుతున్నాయి. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలం అయ్యాయి. బ్యాంక్ లకు రుణాల ఎగవేతపై గతంలోనే కేసు నమోదు చేసిన సీబీఐ విచారణలో భాగంగా, ఎమ్మార్ లో ఉన్న ఆయన నివాసంపై దాడి చేసింది. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు అధికారులు ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. సీబీఐ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Raghuramakrishnamraju
CBI
YSRCP
Narsapuram

More Telugu News