Khairatabad: నేడు ఖైరతాబాద్ మహా గణనాధుని కర్రపూజ!

  • ఖైరతాబాద్ లో వెలిసే మహా గణపతి
  • పదకొండు రోజుల పాటు పూజలు
  • నేటి సాయంత్రం 5 గంటలకు కర్రపూజ
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఖైరతాబాద్‌ లో ప్రతి సంవత్సరమూ వినాయక చవితి సందర్భంగా కొలువుదీరి పదకొండు రోజులపాటు కోట్లాది మంది పూజలందుకునే మహా గణపతి గురించి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం విగ్రహ తయారీ పనులకు ఆరంభంగా ఏకాదశి సందర్భంగా నేటి సాయంత్రం 5 గంటలకు కర్రపూజ నిర్వహించనున్నారు. గంట పాటు ఈ కార్యక్రమం సాగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ వెల్లడించారు. కర్రపూజకు బండారు దత్తాత్రేయ, దానం నాగేందర్‌, విజయారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొంటారని ఆయన అన్నారు.
Khairatabad
Ganesh
Bada Ganesh
Hyderabad

More Telugu News