రాహుల్ వ్యాఖ్యలు భరించలేకపోతున్నాం... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

  • ఆయన వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉంటున్నాయి
  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు
  • కాంగ్రెస్ అధినేతపై మండిపడిన బీజేపీ నేతలు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి, సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు రాహుల్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు భరించలేని విధంగా, అమర్యాదకరంగా ఉంటున్నాయని నక్వీ ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలపై రాహుల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేవిగా ఉంటున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలతో ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు నక్వీ తెలిపారు.
Go Back to Shorts
BJP
Rahul Gandhi
Congress

More Telugu News