గాంధీ ఆసుపత్రిని సందర్శించిన బ్రిటన్ రాణి కోడలు సోఫీ హెలెన్!
- పీడియాట్రిక్, నియోనాటాలజీ వార్డుల పరిశీలన
- డైమండ్ జూబ్లీ ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న సోఫీ
- సేవలను స్వయంగా పరిశీలించేందుకు రాక
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆధ్వర్యంలో నడిచే డైమండ్ జూబ్లీ ట్రస్ట్ కు సోఫీ హెలెన్ వైస్ ప్యాట్రన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో డైమండ్ జూబ్లీ ట్రస్ట్ అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించేందుకు సోఫీ హెలెన్ విచ్చేశారు.