Maruti Rao: మిర్యాలగూడలో ఇంటికి వెళ్లే ముందు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం చేసిన మారుతీరావు!

  • గత సెప్టెంబర్ లో పరువు హత్య
  • నిన్న బెయిలుపై విడుదలైన మారుతీరావు
  • వారంలో రెండు రోజులు స్టేషన్ లో హాజరు కావాలని షరతు
గత సంవత్సరం సెప్టెంబర్ లో తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ పరువు హత్యలో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు మిర్యాలగూడకు చేరుకున్నారు. నిన్న వరంగల్ జైలు నుంచి విడుదలైన ఆయన, పట్టణానికి వచ్చి, నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టారు. వారంలో రెండుసార్లు స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలన్న షరతును హైకోర్టు విధించడంతో, ఆయన తొలుత స్టేషన్ కు వచ్చి, ఆపై ఇల్లు చేరుకున్నారు. ఏడు నెలల తరువాత ఇంటికి వచ్చిన మారుతీరావును పట్టణానికి చెందిన పలువురు పరామర్శించారు. మారుతీరావు విడుదలైన నేపథ్యంలో, ఆయనపై నిఘా పెట్టిన పోలీసులు, అమృత ఇంటి వద్ద టూ ప్లస్ టూ ప్రాతిపదికన భద్రతను పెంచారు. మీడియాతో మాట్లాడేందుకు మాత్రం మారుతీరావు అంగీకరించలేదు.
Maruti Rao
Miryalaguda
Pranay
Amrutha
Bail

More Telugu News